Kaizer News

మనలో ఫైర్‌ ఉంటే ప్రపంచంలో ఏదీ ఆపలేదు: విజయ్‌ దేవరక

మనలో ఫైర్‌ ఉంటే ప్రపంచంలో ఏదీ ఆపలేదు: విజయ్‌ దేవరకొండ

· Entertainment · sakshi.com

వేణుగోపాల్, సందీప్‌ రెడ్డి, విజయ్‌ దేవరకొండ, సుమంత్‌ ప్రభాస్ ‘‘మన హార్ట్‌లో ఫైర్‌ ఉండి, యాంబిషన్‌ ఉండి, నీకు నీపై నమ్మకం ఉంటే ఎప్పుడైనా సక్సెస్‌ కొట్టొచ్చు. బాయ్స్‌... మీ అందరికీ చెబుతున్నాను. వర్క్‌ని ఎంజాయ్‌ చేస్తూ, నీపై నువ్వు నమ్మకం ఉంచి, మనలోని ఫైర్‌ను అలానే కొనసాగించగలిగితే ప్రపంచంలో ఏదీ మనల్ని ఆపలేదు’’ అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. సుమంత్‌ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్‌ జంటగా నటించిన సినిమా ‘రోమాంచకం’. సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో వేణుగోపాల్‌రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలోని పాటను రిలీజ్‌ చేశారు. అనంతరం విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘అప్పట్లో ఒకవేళ ఆ సినిమా (‘అర్జున్‌ రెడ్డి’) ఆడకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి మాది. చేతుల్లో డబ్బులు లేవు, ఇన్‌ఫ్లూయెన్స్, కనెక్షన్స్‌ లేవు. వెనక మీరందరూ (ఫ్యాన్స్‌) కూడా లేరు. అప్పటికి ‘పెళ్ళి చూపులు’ సినిమా రిలీజ్‌ కాలేదు. సందీప్, ప్రణయ్‌ అన్న, ప్రభాకర్‌ అంకుల్‌ వాళ్ల పోలం అమ్మి ‘అర్జున్‌ రెడ్డి’ తీశారు. నా గురించి సందీప్‌ ఎంత దూరం అయిన వెళ్లేటోడు. నేను సందీప్‌ గురించి ఎంత దూరమైనా వెళ్తా. ‘నువ్వు పిలిచినప్పుడు రాకపోతే బతికి వేస్టు..’. ఇక మా రౌడీవేర్‌ ఆఫీస్‌ దగ్గర సుమంత్‌ అప్పుడప్పుడు కనిపించేవాడు. వీడు లైఫ్‌లో యాక్టరో, డైరెక్టరో అవుతాడనుకున్నాను. సందీప్, ప్రణయ్‌ అన్న ఒక సినిమా చేస్తున్నారంటే... అది కచ్చితంగా విజయం సాధించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నాకు ఇంకా గుర్తుంది. ‘అర్జున్‌ రెడ్డి’ ఆడియో ఫంక్షన్‌లో నేను దిగినప్పుడు మీ అరుపులు విని, ఇక్కడ్నుంచి వెళ్లకూడదని ఫిక్స్‌ అయ్యాను. ఈ ఇండస్ట్రీ నుంచి కదిలేదే లేదు... ఫిక్స్‌’’ అని చె΄్పారు. రష్మిక మందన్నా గురించి అభిమానులు అడిగితే... ‘‘వదినమ్మా... బాగానే ఉంది. గాయమైంది. రికవరీ అవుతోంది. ఇంట్లో ఎంజాయ్‌ చేస్తోంది. ‘రణబాలి’ సినిమా గురించి త్వరలోనే మాట్లాడదాం’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘రోమాంచకం’ కథ విన్నప్పుడు చెప్పినట్లు తీస్తావా? అని డైరెక్టర్‌ను అడిగితే ఓ ఆరు నిమిషాల సీన్‌ తీసి చూపించాడు. చెప్పినదానికన్నా బాగా తీశాడనిపించింది. సెప్టెంబరు 2న ప్రీమియర్స్‌ వేస్తున్నాం. వేణు కల నిజం కాబోతోంది. వేణు జీవితంలో సెప్టెంబరు 2, 3 మార్నింగ్‌ స్పెషల్‌గా ఉండబోతున్నాయి. విజయ్‌కు, నాకు ఇంకా గుర్తుంది.. ఆ ఆగస్టు 24 నైట్‌ (‘అర్జున్‌ రెడ్డి’ని ఉద్దేశించి). అలాంటి మూమెంట్‌ నీకు క్రియేట్‌ కావాలి. ‘రోమాంచకం’ కోసం మా నాన్న, అన్నయ్య, టీమ్‌ హార్డ్‌ వర్క్‌ చేశారు. ప్రేక్షకులు కేటాయించే డబ్బు, సమయం వృథా కావు’’ అని అన్నారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్స్‌కు వెళ్లి ఈ సినిమాని చూడండి’’ అన్నారు ప్రణయ్‌ రెడ్డి వంగా. ‘‘ఈ సినిమా నా కెరీర్‌కి పెద్ద మైల్‌స్టోన్‌ అవ్వాలన్నది నా ఆకాంక్ష’’ అని అన్నారు సుమంత్‌ ప్రభాస్‌. ‘‘కాలేజీ స్టడీస్‌ పూరయ్యాక రియాలిటీ తెలుస్తుంది. కొంత కన్‌ఫ్యూజ్‌ అవుతాం. నిర్ణయాలు సరిగ్గ

Original source: sakshi.com
Read more on Kaizer News