ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లు (ZPP), మండల ప్రజా పరిషత్‌ల (MPP) ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం(AP Local Body Elections) ముగియనుండటంతో, వాటి పరిపాలనా బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగనుంది. AP Dugarajapatnam Shipyard: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దుగరాజపట్నంలో రూ. 15,000 కోట్లతో షిప్ యార్డ్.. 45 వేల మందికి ఉద్యోగాలు! ప్రస్తుత మండల ప్రజా పరిషత్‌ల పదవీకాలం సెప్టెంబర్ 23తో ముగియనుండటంతో సెప్టెంబర్ 24 నుంచే అవి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. మండలాలకు ఎంపీడీవో కంటే పైస్థాయి ర్యాంకు కలిగిన ఆర్డీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు ఇన్ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారు. మరోవైపు జెడ్పీల గడువు సెప్టెంబర్ 24తో ముగియనుండటంతో సెప్టెంబర్ 25 నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లు జెడ్పీ ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ తాత్కాలిక పాలన గరిష్టంగా ఆరు నెలల పాటు అమల్లో ఉండే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా గతంలో ఉన్న 13 జెడ్పీల స్థానంలో ఏకంగా 28 జిల్లా పరిషత్‌లను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ పదవీకాలం పూర్తయిన వెంటనే నూతన జెడ్పీ వ్యవస్థ ఉనికిలోకి రానుంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఫొటో ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు వేగవంతం చేయడంతో త్వరలోనే స్థానిక పోరుకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది