ఐరాస టెన్షన్ టెన్షన్ జజ Andhra Orabha Top Story ప్రపంచ దేశాల మధ్య విభేదాలు.. యుద్ధాలతో అట్టుడుకుతున్న ప్రాంతాలు.. కృత్రిమ మేధ (ఏఐ)తో కొత్త ముప్పులు.. ఆర్థిక, ఆహార భద్రతపై ఆందోళనలు.. ఇలా అంతర్జాతీయ సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వసభ్య సమావేశాల ఉన్నతస్థాయి వారోత్సవాలు న్యూయార్క్‌లో ప్రారంభం కానున్నాయి. దాదాపు 130 దేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. వరుసగా రెండో ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరాస వేదికపై ప్రసంగించనుండటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటైన అంతర్జాతీయ వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. ఐరాస కూడా తన ప్రాసంగికతను నిలబెట్టుకునేందుకు సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా నిధుల కోతలు, పలు ఐరాస సంస్థల నుంచి వైదొలగడం వంటి ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పదవీకాలం 2026 చివర్లో ముగియనుండటంతో తదుపరి సారథి ఎవరన్న దానిపైనా స్పష్టత లేదు. చైనాతో సహా కీలక దేశాల నేతల భాగస్వామ్యంపైనా ఆసక్తి నెలకొంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈసారి న్యూయార్క్ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. గురువారం వాషింగ్టన్‌లో ట్రంప్‌తో ముఖాముఖి చర్చలకు ప్రాధాన్యమివ్వనున్నారు. ప్రపంచ సంక్షోభాల పరిష్కారంలో ఐరాస పాత్ర ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుందన్న చర్చకు ఈ పరిణామం మరింత ఊతమిస్తోంది. అంతర్జాతీయ సంక్షోభాల అధ్యయన బృందం (ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్)కు చెందిన రిచర్డ్ గోవన్ అభిప్రాయం ప్రకారం.. గతేడాది ఐరాస ఎదుర్కొన్న అత్యవసర పరిస్థితి కొంత తగ్గినా, సంస్థ ఇంకా దీర్ఘకాలిక సంక్షోభంలోనే కొనసాగుతోంది. ఆర్థిక ఇబ్బందులు, సభ్యదేశాల మధ్య విభేదాలు, సంస్థాగత సవాళ్లు ఐరాసను వెంటాడుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఐరాస సాధారణ బడ్జెట్‌కు ఈ వారం 725 మిలియన్ డాలర్లను చెల్లించిన అమెరికా.. జనరల్ అసెంబ్లీలో ఓటు హక్కును కోల్పోయే పరిస్థితిని తప్పించుకుంది. అయినప్పటికీ, సంస్థకు ఇంకా ఒక బిలియన్ డాలర్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఐరాస వ్యయాలను తగ్గించాలని, సంస్కరణలు చేపట్టాలని అమెరికా ఒత్తిడి కొనసాగిస్తోంది. కృత్రిమ మేధ అభివృద్ధి వేగం, దాని వల్ల తలెత్తే ముప్పులు ఈసారి ఐరాస సమావేశాల్లో కీలక చర్చనీయాంశంగా మారనున్నాయి. ఏఐ సాంకేతికత స్వయంగా తన సామర్థ్యాలను మెరుగుపరుచుకుని, మానవ నియంత్రణను అధిగమించే ప్రమాదం ఉందంటూ ఇటీవల పలువురు ప్రముఖ ఏఐ పరిశ్రమ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాంకేతిక అభివృద్ధిపై అంతర్జాతీయ సమన్వయం, జాగ్రత్తలు అవసరమన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.ఏఐ రంగంలో ముందున్న దేశాలు ఉమ్మడి నియంత్రణ మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకోవాలని గుటెరస్ పిలుపునిచ్చారు. లేనిపక్షంలో ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తుకు దారితీసే పోటీ నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐపై ప్రపంచస్థాయి పాలనా వ్యవస్థ ఉండాలని ఆయన చాలాకాలంగా ప్రతిపాదిస్తున్నారు. ఇందులో భాగంగా 2023లో ఐరాస ఏఐపై సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇందులో సాంకేతిక సంస