Kaizer News

Sircilla: ఉద్యమకారుల జేఏసీ జిల్లా చైర్మన్‌గా గజ్జల

Sircilla: ఉద్యమకారుల జేఏసీ జిల్లా చైర్మన్‌గా గజ్జల దేవరాజు ఎంపిక!

· State - Telangana · hmtvlive.com

Sircilla: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారుల హక్కుల సాధనకు కృషి చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల సంఘాల జేఏసీ నూతన చైర్మన్ గజ్జల దేవరాజు తెలిపారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో ఆదివారం వివిధ ఉద్యమకారుల సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల సంఘాల జేఏసీ చైర్మన్‌గా గజ్జల దేవరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం దేవరాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యాలను అర్హులైన ఉద్యమకారులందరికీ అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల త్యాగాలకు, సేవలకు తగిన గౌరవం దక్కే వరకు వారి హక్కుల కోసం పోరాడుతానని దేవరాజు పేర్కొన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు బుస్స వేణు, రాచర్ల వెంకన్న, కర్నె లక్ష్మి, పత్తిపాక పద్మ, శంకర్, అక్కెనపెల్లి కరుణాకర్, మాజీ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్, బండి దేవదాస్, నిమ్మశెట్టి విజయ్, వెంగల శ్రీకాంత్ గౌడ్, మడుపు వనజ, గుగులోతు రేనా, ఆఫ్రోజ్, పవన్, సాయికిరణ్ గౌడ్, కాసర్ల పవన్, లింగంపల్లి మధు, సికిందర్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News