Kaizer News

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి : ఇల్లెందు డీఎస్

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి : ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు

· State - Telangana · ntnews.com

ఇల్లెందు, సెప్టెంబర్ 19 : నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ‌ని, రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు అన్నారు. శనివారం ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రౌడీషీటర్లు ఇకపై ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, నేరాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా బెదిరింపులు, దాడులు, అక్రమ కార్యకలాపాలు లేదా ఇతర నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు తమ గత నేర చరిత్రను పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవిస్తూ, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు సురేష్, సత్యనారాయణ, ఎస్ఐలు తిరుపతి, ఉమా, సారంగపాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News