Kaizer News

వెయ్యి కోట్లు ఇవ్వు.. నా ఆస్తులన్నీ ఇచ్చేస్త..రేవం

వెయ్యి కోట్లు ఇవ్వు.. నా ఆస్తులన్నీ ఇచ్చేస్త..రేవంత్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడ్త

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: వెయ్యి కోట్లు ఇస్తే తన ఆస్తులన్నీ ఇచ్చేస్తానని.. సీఎం రేవంత్​ ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ పెడ్తానని బీఆర్​ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​అన్నారు. ‘కేసీఆర్​ కుటుంబం 400 ఎకరాల భూములతో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్​ రెడ్డి చెబుతున్నారు.. రేవంత్​కు ఓ బంపర్​ ఆఫర్​ ఇస్తున్నా. ఆయన అంటున్న రూ.లక్ష కోట్లలో రూ.వెయ్యి కోట్లు తనకు ఇస్తే ఆ భూములు మొత్తం రాసిచ్చేస్తా. రేవంత్​ ఎక్కడ సంతకం పెట్టుమన్నా పెడతా.. ’ అని సవాల్​ విసిరారు. రూ.వెయ్యి కోట్లు ఇచ్చాక.. లక్ష కోట్లలో మిగిలిన రూ.99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. రైతు భరోసా, మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, ఫీజు రీయింబర్స్​మెంట్, దళితబంధు, గిరిజనబంధు పథకాలను అమలు చేసి చూపించాలన్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్​ను, బీఆర్​ఎస్​ పార్టీ నాయకులను టార్గెట్​ చేయడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్​ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే లక్ష్యానికి బదులు కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్​ చేసుకున్నదన్నారు. ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో శుక్రవారం నాంపల్లి కోర్టు వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్లంటూ విష ప్రచారం చేశారని, ఇప్పుడు తమ భూముల విషయంలో అదే స్థాయిలో కేసీఆర్​పై విషం చిమ్ముతున్నారని కేటీఆర్​ మండిపడ్డారు. హైదరాబాద్​కు 75 కిలోమీటర్ల దూరంలోని ఎర్రవల్లిలో 20 ఏండ్ల క్రితం కేసీఆర్​ భూములు కొన్నారని, అప్పుడు ఎకరం రూ.5 లక్షలే ఉందని గుర్తు చేశారు. పదివేల ఎకరాలు కేసీఆర్​ కబ్జా చేశారంటూ ఎన్నోసార్లు రేవంత్​ ఆరోపించారని, వెయ్యి ఎకరాల ఫాంహౌస్​ అంటూ మాట్లాడారని మండిపడ్డారు. కానీ, అసెంబ్లీలో 67 ఎకరాలేనని రేవంతే స్వయంగా చెప్పారని పేర్కొన్నారని.. మరి, మిగతా 933 ఎకరాలు ఎటు పోయాయని రేవంత్​ను కేటీఆర్​ ప్రశ్నించారు. ముందు కేసీఆర్​కు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. పేదల భూములను 22ఏలో పెట్టి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని కేటీఆర్​ ఆరోపించారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్​ ఈ భూముల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఎన్ని కేసులు పెట్టుకుంటవో పెట్టుకో.. ఎన్ని కమిషన్లు వేస్తవో వేసుకో.. ఏం చేసుకుంటవో చేసుకో.. నువ్వు ఏమీ చేయలేవు అని ప్రజలకు అర్థమైంది. పోలీసులు వేధిస్తున్నా.. పోలీసుస్టేషన్​లోనే మాపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలే.. న్యాయస్థానాలు అండగా నిలిచినయ్.​. హైదరాబాద్​కు పేరు తెచ్చే ఫార్ములా ఈ రేస్​ను తీసుకొచ్చాం. కానీ, ఆ రేసులో ఏదో జరిగిపోయిందని ఆరోపిస్తూ నాపై కేసు పెట్టారు. అయినా సరే ఎదుర్కొంటం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ రేస్ నిర్వహించినం. తమిళనాడు సీఎం విజయ్​ ఇటీవల మోటార్​ స్పోర్ట్​ రేసింగ్​ కోసం లండన్​ పోయిండు.. పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నరు.. అదే ప్రయత్నం మేం చేసినం. కానీ, మా మీద కేసులు పెట్టి వేధిస్తున్నరు. కోర్టుకు ఇప్పటికే రెండు సార్లు వచ్చిన. ఎన్నిసార్లు పిలిచినా వస్తా. విచారణకు సహకరిస్తా’’ అని కేటీఆర్ చె

Original source: v6velugu.com
Read more on Kaizer News