Kaizer News

Chintalapudi: శివాపురం పాఠశాలలో తాగునీటి బోరుబావి

Chintalapudi: శివాపురం పాఠశాలలో తాగునీటి బోరుబావి పనులకు శ్రీకారం!

· State - Telangana · hmtvlive.com

Shorts Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం, శివాపురం గ్రామ సచివాలయ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల (MP UP School) ఆవరణలో విద్యార్థుల తాగునీటి ఎద్దడిని నివారించేందుకు శుక్రవారం బోరుబావి మరియు సింగిల్ ఫేస్ మోటారు ఏర్పాటు పనులను అధికారికంగా ప్రారంభించారు. మండల పరిషత్ నిధుల నుండి సుమారు 2,20,000అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఈ పనులకు ఎంపీపీ డాక్టర్ బి. రాంబాబు నాయక్, జెడ్పీటీసీ నీరజ మరియు ఎంపీటీసీ కపూర్ గారలు ముఖ్య అతిథులుగా హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పాఠశాల విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మండల పరిషత్ నిధుల ద్వారా తక్షణమే ఈ పనులను మంజూరు చేసి ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News