Kaizer News

US Iran War Code 100: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అ

US Iran War Code 100: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!

· International · telugu.abplive.com

అమెరికా దాడులు చేస్తే, సైనిక స్థావరాలపై ప్రతీకారం చేస్తామంది. US Iran War Code 100: అమెరికాతో యుద్ధం ముగించేందుకు ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 'కోడ్ 100' అల్టిమేటం జారీ చేసింది. అలాగే చర్చలు తిరిగి ప్రారంభించేందుకు 7 షరతులను విధించింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్‌కు తమ షరతులు తెలిపామని ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ తమ షరతులను అంగీకరించకపోతే యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ తేల్చిచెప్పింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ మాట్లాడుతూ షరతుల విషయాన్ని వెల్లడించారు. "మేము ఖతార్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. యుద్ధాన్ని ముగించడానికి మా షరతులను ఖతార్ వాషింగ్టన్‌కు తెలియజేసింది. ఇప్పుడు మేము యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా టెహ్రాన్ తన వైఖరిని స్పష్టం చేస్తూ, ట్రంప్ బెదిరింపులకు తాము భయపడేది లేదని, ఈ షరతులను అంగీకరించడం వాషింగ్టన్ ప్రయోజనాలకే మంచిదని రెజాయీ హెచ్చరించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఐఆర్‌జీసీ, సైన్యం, భద్రతా దళాలతో సహా తన సాయుధ దళాలన్నింటికీ ఇరాన్ అత్యున్నత స్థాయి హెచ్చరిక అయిన 'కోడ్ 100'ను జారీ చేసింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్యాంప్ డేవిడ్‌లో తన వీకెండ్ సెలవును కుదించుకుని వైట్ హౌస్‌కు తిరిగి వస్తున్నారు. అలాగే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా తన అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా రాయబార కార్యాలయాలన్నీ ఇప్పటికే భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. రాన్ సైనిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ సైనిక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు రెజాయీ తెలిపారు. ప్రస్తుత ప్రణాళికలు గల్ఫ్ నుంచి ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్న అమెరికా నేవీ స్థావరాలను టార్గెట్ చేశామని హెచ్చరించారు. భవిష్యత్తులో మళ్లీ దాడి జరిగితే ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు, స్థానిక అమెరికన్ వ్యాపారాలు, కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుని భారీ ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేశారు. .. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుండి వైదొలగాలని టెహ్రాన్ ప్రస్తుతం నిర్ణయించుకోలేదని రెజాయీ స్పష్టం చేశారు. అయితే అమెరికా అనుసరించే విధానాలే ఇరాన్‌ను ఆ దిశగా ఆలోచించేలా చేస్తున్నాయని హెచ్చరించారు. ఇరాన్ అణు విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, అణ్వాయుధాల వాడకాన్ని నిషేధించే నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని రెజాయీ స్పష్టం చేశారు. . రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు అణు కార్యక్రమంపై ఇరాన్ వైఖరి ఏమిటి? ఇరాన్ అణు విధానంలో మార్పు లేదని, అణ్వాయుధాల వాడకాన్ని నిషేధించే నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని రెజాయీ స్పష్టం చేశారు. NPT నుండి వైదొలగాలని నిర్ణయించుకోలేదు. Up Next Up Next Up Next Up Next వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట

Original source: telugu.abplive.com
Read more on Kaizer News