Kaizer News

డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం

డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం

· National - India · ntnews.com

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 19: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. నాలుగు కీలక స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను దక్కించుకోగా, కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. సంఘం అధ్యక్షుడిగా ఏబీవీపీకి చెందిన యశ్‌ దబాస్‌ ఎన్నికయ్యారు. రెండు క్యాంపస్‌లు కలిగి ఉన్న ఢిల్లీ యూనివర్సిటీలో 91 కాలేజీలు ఉండగా, 52కి ఎన్నికలు జరిగాయి. కాగా, గతంలో అరుణ్‌ జైట్లీ, విజయ్‌ గోయల్‌, మాకెన్‌, అల్కా లాంబా డీయూఎస్‌యూ అధ్యక్షులుగా పనిచేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News