Kaizer News

కువైట్‌ నుంచి సుపారీ.. లైవ్‌ వీడియో మర్డర్‌!

కువైట్‌ నుంచి సుపారీ.. లైవ్‌ వీడియో మర్డర్‌!

· State - Telangana · sakshi.com

వివాహేతర సంబంధం అనుమానంతో చిన్నమ్మ కొడుకును హత్య చేయించిన సోదరుడు రాయచోటి టౌన్‌/వీరబల్లె: వివాహేతర సంబంధం అనుమానంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం అన్నమయ్య జిల్లా వీరబల్లె మండలం ఓదివీడులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కడపకు చెందిన బాషాకు, ఓదివీడుకి చెందిన బేల్దారి ఖాదర్‌ బాషా కుమార్తె షాహీదాతో 2010లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. షాహీదా ఏడేళ్ల క్రితం కువైట్‌ నుంచి స్వదేశానికి వచ్చి, పుట్టిన ఊరు ఓదివీడులోనే ఇల్లు నిర్మించుకుని ఉంటోంది. ఆమె భర్త బాషా కువైట్‌ నుంచి కుటుంబానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చేవాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భర్త బాషా పిన్నమ్మ కుమారుడైన ఖాసీం (ఇతడు కూడా కువైట్‌లో ఉంటూ అప్పుడప్పుడూ ఓదివీడుకు వచ్చిపోయేవాడు) తరచూ ఓదివీడులోని షాహీదా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. దీనిపై భర్త బాషాకు తీవ్ర అనుమానం వచ్చి పగ పెంచుకున్నాడు. కువైట్‌ నుంచి సుపారీ.. లైవ్‌ వీడియోలు తీసి కిరాతకం పది రోజుల క్రితమే ఖాసీం కువైట్‌ నుంచి ఇంటికి వచ్చిన విషయం బాషాకు తెలిసింది. దీంతో ఆయన తన మరో పిన్నమ్మ కుమారులు అయిన బాబ్జి, ఖాదర్‌వలిని పురమాయించాడు. ఖాసీంను వెంటాడి చంపాలని, ఆ సమయంలో తనకు వీడియోలు తీసి పంపాలని వారికి సూచించాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం బాబ్జి, ఖాదర్‌వలి ఓదివీడుకు చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో ఖాసీం, షాహీదాతోపాటు ఆమె కుమార్తె ఉన్నారు. నిందితులిద్దరూ లోపలికి వెళ్లి గడియలు పెట్టారు. తమతో తీసుకొచ్చిన కర్ర, బెల్ట్‌తో ఖాసీం, షాహీదాలను తీవ్రంగా కొట్టారు. షాహీదా కుమార్తెతో బలవంతంగా వీడియోలు తీయించి కువైట్‌లోని బాషాకు పంపారు. ఈ ఘటన దాదాపు రెండు గంటలపాటు సాగింది. లోపల జరుగుతున్న అరాచకాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్‌ చేశారు. అయితే పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి రాలేదు. చివరికి ఖాసీం చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు.. గదుల్లో ఉన్న రక్తపు మరకల్ని నీళ్లతో పూర్తిగా కడిగేసి సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. నిందితులు తలుపులు తీయగానే స్థానికులు బాబ్జీని పట్టుకుని, ఘటనా స్థలానికి చేరుకున్న వీరబల్లె ఎస్‌ఐ సుస్మితారెడ్డికి అప్పగించారు. అనంతరం పోలీసులు ఇల్లు, లోపలి ప్రాంతాలను తనిఖీ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఖాసీం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News