బొడ్డపాడు: బొడ్డవర పరిధిలోని బొడ్డపాడు గ్రామంలో ఇటీవల మృతి చెందిన గిరిజన బాలిక అనిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గారు స్వయంగా వెళ్లిపరామర్శించారు. వారిపరిస్థితినిఅడిగితెలుసుకునితక్షణ ఆర్థిక సాయంగా రూ. పది వేలను అందజేశారు. బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి తగిన సాయం అందేలా చూసి పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించమని, ఏ సాయం అవసరమైనా తన దగ్గరకి రమ్మని భరోసా ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు