విజయనగరం జిల్లా: కూటమి నేతలు దోపిడీకి అలవాటు పడ్డారని మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గజపతినగరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ‘‘40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో వస్తూ ఉంటారు... పోతూ ఉంటారు. ఒకరు పోతే వంద మంది వస్తారు. ఇప్పుడు కూటమి నేతల తీరు చూస్తూ ఉంటే బీపీ పెరిగి పోతుంది. కూటమి నేతలు దోపిడీకి అలవాటు పడ్డారు. అలీబాబా 40 దొంగలు తీరులా వీళ్లంతా ఒకటయ్యారు. సెటిల్‌మెంట్లు అన్నీ పోలిస్ స్టేషన్లల్లో, ఎండీవో ఆఫీసుల్లో జరుగుతున్నాయి. ఇదీ కూటమి ప్రభుత్వ తీరు. మీ వెంటే... అప్పలనర్శయ్య తో పాటుగా నేను. మా పిల్లలు ఉంటారు. పార్టీ బోలేపేతానికి కృషి చెయ్యండి’’ అని అన్నారు. కాగా, గజపతినగరం నియోజకవర్గంలో బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, పెనుమత్స సురేష్ బాబు, పార్లమెంటు ఇన్‌చార్జ్ సత్యనారాయణ, గజపతినగరం నియోజకవర్గం ఇన్‌చార్జి జగన్ మోహన్ రావు హాజరయ్యారు. కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్