Kaizer News

Tragedy | వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో విషాదం.. డ్

Tragedy | వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో విషాదం.. డ్యాన్స్‌ చేస్తూ వృద్ధుడు మృతి

· State - Telangana · ntnews.com

అమరావతి : ఉల్లాసంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం (Vinayaka immersion ) ఊరేగింపులో లో ఒక్కసారిగా విషాదం (Tragedy ) చోటు చేసుకుంది. ఎంతో భక్తిశ్రద్ధలతో విగ్రహాలను నెలకొల్పి నిత్యం పూజలు చేసిన ఆ కాలనీవాసులకు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. విశాఖ ( Visaka ) జిల్లా ఎండాడ గ్రామంలో ఆదివారం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మండపం వాసులు డప్పు, వాయిద్యాలతో బయలు దేరారు. దారి పొడవున సంగీతానికి అనుగుణంగా చిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు గల వారందరూ నృత్యాలు చేశారు. వీరిలో శంకర్రావు (62) అనే వృద్ధుడు డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందడంతో నిమజ్జన ఊరేగింపులో విషాదం అలుముకుంది

Original source: ntnews.com
Read more on Kaizer News