Kaizer News

Kurnool: నిరుద్యోగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ - బుట

Kurnool: నిరుద్యోగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ - బుట్టా ఫౌండేషన్

· State - Telangana · hmtvlive.com

Shorts కర్నూలు: కర్నూలు నగరం లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ మరియు బుట్టా ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి బుట్టా రేణుక తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆమె నేడు కర్నూలులోని బుట్టా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ, జిల్లాలోని ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద నిరుద్యోగ యువతకు తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించేందుకు కేవలం విద్యార్హతలు మాత్రమే కాకుండా కంప్యూటర్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మరియు వ్యక్తిత్వ వికాసం వంటి నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుట్టా ఫౌండేషన్ ద్వారా యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మరియు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ రంగ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను యువతకు పరిచయం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. యువతకు నైపుణ్యం అందిస్తే వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకుండా నిరుద్యోగ యువతకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించడమే బుట్టా ఫౌండేషన్ లక్ష్యం” అని బుట్టా రేణుక తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలు మరియు అవసరమైన వివరాలను స్థానిక బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీలోపు సమర్పించి నమోదు చేసుకోవాలని తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News