Kaizer News

Markapuram: వెలిగొండ ప్రాజెక్టును తనిఖీ చేసిన కలెక

Markapuram: వెలిగొండ ప్రాజెక్టును తనిఖీ చేసిన కలెక్టర్ విజయ సునీత

· State - Telangana · hmtvlive.com

Shorts Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నేడు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి, నీటి నిల్వలు మరియు ప్రాజెక్టును సమగ్రంగా పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ జలహారతి వ్యూ పాయింట్‌ను సందర్శించడంతో పాటు, టన్నెల్-2 ఎగ్జిట్ పాయింట్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు తాజా వివరాలను కలెక్టర్ వెల్లడించారు: ఆదివారం ఉదయం 8:00 గంటల సమయానికి నల్లమల సాగర్ జలాశయంలో 6 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 243.8 మీటర్లుగా నమోదు కాగా, క్రాస్ రెగ్యులేటర్ వద్ద 4.05 కిలోమీటర్ల మేర నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. నేడు శ్రీశైలం ప్రాజెక్టు నుండి నల్లమల సాగర్‌కు 2,100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నీటి విడుదల మరియు నిర్వహణ ప్రక్రియలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News