Kaizer News

త్వరలో కాళేశ్వరంరిపేర్లు.. వచ్చే వానకాలంలోపు బరాజ్

త్వరలో కాళేశ్వరంరిపేర్లు.. వచ్చే వానకాలంలోపు బరాజ్‌లు అందుబాటులోకి

· State - Telangana · ntnews.com

ప్రాజెక్టుల్లో నీటి నిల్వల్లేవు తాగునీటి తర్వాతే సాగుకు నీళ్లిస్తం : మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు త్వరలో మరమ్మతులు చేపట్టనున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాటి సభలో ‘ఎల్‌నినో’పై స్వల్పకాలిక చర్చను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం నీటి నిల్వకు అవి సురక్షితం కావని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టం చేసిందని మరోసారి వ్యాఖ్యానించారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేసి వానకాలంలోపు ఆ మూడు బరాజ్‌లను వినియోగంలోకి తెస్తామని చెప్పారు. తమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎన్‌ నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. జలాశయాల్లో కనిపించే మొత్తం నీరు సాగుకు అందుబాటులో ఉన్నట్టు కాదని తేల్చారు. 589 టీఎంసీల కెపాసిటీకి 241 టీఎంసీల నీరే అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 44,034 చెరువుల్లో 40 శాతం చెరువులు 4వ వంతుకంటే తకువగా నిండాయని చెప్పారు

Original source: ntnews.com
Read more on Kaizer News