Kaizer News

Nellore: సంగం గురుకుల పాఠశాలలో రేపు స్పాట్ అడ్మిషన

Nellore: సంగం గురుకుల పాఠశాలలో రేపు స్పాట్ అడ్మిషన్లు 15 సీట్లు ఖాళీ!

· State - Telangana · hmtvlive.com

Nellore: నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి రేపు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు.5వ తరగతిలో 6 సీట్లు, 6వ తరగతిలో 2 సీట్లు, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 4 సీట్లు, బైపీసీలో 3 సీట్లు కలిపి మొత్తం 15 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన సరైన డాక్యుమెంట్లతో రేపు ఉదయం గురుకుల పాఠశాలకు హాజరు కావాలని సూచించారు.మెరిట్ ఆధారంగా స్పాట్‌లోనే అడ్మిషన్లు కల్పిస్తామని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News