తెలంగాణ శాసనసభలో సాగునీరు, ఎల్ నినో పరిస్థితులపై జరిగిన చర్చపై బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ప్రకృతి తెచ్చిన కష్టం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన మానవ నిర్మిత కరువని ఆరోపించారు. కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బాధ్యతాయుతమైన నాయకుడిగా తాను ఈ విషయాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా […]