Kaizer News

కృత్రిమ సూర్యుడి దిశగా భారత్ కీలక ముందడుగు..

· National - India · tv9telugu.com

అపరిమితమైన స్వచ్ఛమైన ఇంధనాన్ని సాధించే లక్ష్యంతో భారత్‌ చేపట్టిన ఫ్యూజన్‌ పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రీసెర్చ్‌ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌టీ-1లో 82.6 గిగాహెర్ట్జ్‌, 400 కిలోవాట్ల కొత్త గైరోట్రాన్‌ను అనుసంధానించారు. ఇది ప్లాస్మాను వేడిచేయడం, నియంత్రించడంలో శాస్త్రవేత్తలకు ఉపయోగపడనుంది. సూర్యుడిలో జరిగే అణు సంలీన ప్రక్రియను భూమిపై పునఃసృష్టించే ఫ్యూజన్‌ టెక్నాలజీ పరిశోధనలకు ఈ వ్యవస్థ మరింత ఊతమివ్వనుంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News