Kaizer News

నవజాత శిశువులకు బంగారు ఉంగరం

నవజాత శిశువులకు బంగారు ఉంగరం

· National - India · ntnews.com

28న కొత్త పథకం ప్రారంభించనున్న విజయ్‌ చెన్నై : తమిళనాడులోని ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన నవజాత శిశువులకు బంగారు ఉంగరం అందించే కొత్త పథకాన్ని సీఎం విజయ్‌ ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నారు. తైమామస్‌ తంగ మోతిరమ్‌ తిట్టం (మేనమామ బంగారు ఉంగరం పథకం) కింద ఒక గ్రాము బంగారు ఉంగరాలను అందించనున్నారు. 2026 జూన్‌ 22 తర్వాత పుట్టిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. తొలిదశ పంపిణీలో భాగంగా 1.28 లక్షల ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విజయ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ పథకం పొందాలంటే తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన శాశ్వత నివాసితులై ఉండాలి. ఈ పథకం కోసం విజయ్‌ ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 755.83 కోట్లు కేటాయించనుంది

Original source: ntnews.com
Read more on Kaizer News