Kaizer News

Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహుడిని దర్శించుకు

Antarvedi: అంతర్వేది లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న జస్టిస్ ఎన్. హరినాథ్

· State - Telangana · hmtvlive.com

Shorts అంతర్వేది: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవ శ్రీ ఎన్. హరినాథ్ గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. హైకోర్టు న్యాయమూర్తి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చక స్వాములు, సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనం అందించారు. శ్రీస్వామివారి దర్శనం అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కె.టి.ఎన్.వి. ప్రసాద్ జస్టిస్ ఎన్. హరినాథ్ గారికి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News