Kaizer News

67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్‌బై..

67 నుంచి 57 కిలోలకు..! ఆ అలవాట్లకు గుడ్‌బై..

· State - Telangana · sakshi.com

బరువు తగ్గడం అనేది ఎల్లప్పుడు కాస్త క్లిష్టమైనదే. కాకపోతే దాన్ని ఆస్వాదించేలా ఎంజాయ్‌ చేసేలా ప్లానే చేసుకుంటేనే తేలికగా బరువు తగ్గగలుగుతారనేది నిపుణుల మాట. ఎప్పుడు కఠికన ఆహార నియమాలు, వర్కౌట్లు మాత్రమే కాదు. సాధారణ అలవాట్లతో కూడా బరువు తగ్గడం సులభమే అని అంటోంది ఈ డైటీషియన్‌. తన బరువు తగ్గేందుకు ఆ అలవాట్లను దరిచేరనీయకపోవడం వల్లే సాధ్యమైందంటూ..అవేంటో సవివరంగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. వార్దా అనే డైటీషియన్‌ తన బరువు తగ్గే జర్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తాను 67 కిలోల నుంచి 57 కిలోలకు తగ్గినట్లు వెల్లడించారు. అందుకోసం ఎనిమి అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. చాలా వేగంగా తినడం తాను ఐదు నిమిషాల్లో భోజనం ముగించడం మానేసి, తినడానికి సుమారు 15-20 నిమిషాలు తీసుకోవడం ప్రారంభించానని వార్దా చెప్పారు. దీనివల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన అనుభూతి కలిగిందన్నారు. రోటీ, అన్నం మానేయడం కార్బోహైడ్రేట్లను తొలగించడానికి బదులుగా, ఆమె ఆహార పరిమాణాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కొవ్వు తగ్గడం అంటే కేలరీల లోటు, అంతేగానీ కార్బోహైడ్రేట్లను పూర్తిగా తొలగించడం కాదని అంటోంది “పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన ఆహారం” పాటించడం తాను ఎల్లప్పుడూ పరిపూర్ణంగా తినడానికి ప్రయత్నించలేదని అంటున్నారు. అతిగా తినడానికి దారితీసే స్టిక్ట్‌గా అనుసరించే డైట్‌ని ఫాలో అవ్వలేదని అన్నారు. ప్రతిరోజూ బరువును తనిఖీ చేసుకోవడం శరీర బరువులో నీరు, సోడియం, హార్మోన్ల కారణంగా మార్పులు రావచ్చని వార్దా పేర్కొన్నారు. రోజువారీ బరువు సంఖ్యలపై దృష్టి పెట్టడానికి బదులుగా, వారంతమే చెక్‌చేసేదాన్ని అని చెప్పారు. అంతులేని కార్డియో వ్యాయామాలు చేయడం ఆమె ఎక్కువసేపు చేసే కార్డియో వ్యాయామాలపై ఆధారపడలేదు. దానికి బదులుగా,నడవడం, ఎక్కువ అడుగులు వేయడం, చురుకుగా ఉండటంతో సహా రోజువారీ కదలికలపై ఫోకస్‌ పెట్టినట్లు తెలిపారు. ఫ్యాట్ బర్నర్‌లు, డిటాక్స్ డ్రింక్స్‌ వాడటం.. అలాంటి వాటికి దూరంగా ఉంటూ..ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటానికి అవసరమైన ప్రోటీన్, సంపూర్ణ ఆహారాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అపరాధ భావంకి చోటు ఇవ్వకుండా.. ఒకసారి అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నంత మాత్రాన మొత్తం వెయిట్‌లాస్‌ జర్నీ వేస్ట్‌ అయిందని భావించాల్సిన అవసరం లేదని అంటోంది. ఒక పూట తీసుకునే జంక్‌ఫుడ్‌ మీ ఆరోగ్య పురోగతికి అంతరాయం కాదని అంటున్నారామె. ఆకలి వేసేంత వరకు ఉండకుండా.. రోజులో ముందుగా ఆకలితో ఉండటం కంటే..ముందుగానే కొద్దిగా కొద్దిగా తినేలా కేర్‌ తీసుకున్నట్లు తెలిపింది. ఎందుకుంటే విపరీతమైన ఆకలిలో తినే పరిమాణంపై నియంత్రణ ఉండదని అంటోంది. అలాగే సమతుల్య ఆహారమే తీసుకుంటానని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లయితే, ఈ సాధారణ చిట్కాలను పాటించి చూడండి మరి.. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ( చదవండి: బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్‌ వెయిట్‌లాస్‌ జర్నీ ) హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5

Original source: sakshi.com
Read more on Kaizer News