Kaizer News

KTR | పేదల ఖాతాల్లో లక్ష కోట్లు వేస్తావా?.. మాకున్

KTR | పేదల ఖాతాల్లో లక్ష కోట్లు వేస్తావా?.. మాకున్న ప్రతి ఇంచు భూమి రాసిస్తాం..!

· State - Telangana · ntnews.com

KTR : పేదల ఖాతాల్లో లక్ష కోట్లు వేస్తామంటే తమ పేరిట ఉన్న ఇంచు భూమిని కూడా రాసిస్తామని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ కుటుంబానికి లక్ష కోట్ల భూములు ఉన్నాయంటూ సీఎం చేసిన ఆరోపణలపై సవాల్ విసిరిన కేటీఆర్ పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆయన అడ్డగోలు ఆరోపనణలు చేస్తున్నారని ఎక్స్ పోస్ట్‌లో ధ్వజమెత్తారు. రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ రాసిస్తామని, రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ‘‘సీఎం రేవంత్‌.. నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్‌ ఇస్తున్నా. మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విష ప్రచారంపై నీకు ఓ సవాల్‌ విసురుతున్నా. మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం.. రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణలోని పేద ప్రజల ఖాతాల్లో వెంటనే రూ.లక్ష కోట్లు వేస్తానంటే తమ పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని ఉన్నపళంగా రాసిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. పేదల ఖాతాల్లో లక్ష కోట్ల రూపాయలు వేసేంత ధైర్యం లేకుంటే తనపై చేస్తున్న ప్రచారాన్ని ఇకనైనా ఆపి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు’’ అని అన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉందంటూ ఇంతకాలం చేసిన ప్రచారం బెడిసికొట్టడంతో ఇప్పుడు లక్ష కోట్ల భూములంటూ రేవంత్ రెడ్డి కొత్త ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది 67 ఎకరాలు మాత్రమేనని రేవంత్‌ రెడ్డే అసెంబ్లీలో స్వయంగా అంగీకరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తు చేశారు. అలాంటప్పుడు మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీల అమలు విషయంలో జరిగిన మోసాల నుంచి, 22ఏ భూముల అంశం నుంచి నాలుగు కోట్ల మంది ప్రజల దృష్టిని ఇలాంటి ఆరోపణలతో మళ్లించలేరని ఆయన స్పష్టం చేశారు. ‘‘నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు?’’ అని సీఎంను సూటిగా కేటీఆర్‌ ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఇలాగే దుష్ప్రచారం చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ మరోసారి ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్ముతారని భావించడం సరికాదని ముఖ్యమంత్రికి ఆయన హితవు పలికారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో

Original source: ntnews.com
Read more on Kaizer News