Kaizer News

బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం..

బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం..

· State - Telangana · prabhanews.com

బయట కాల్చిన బాణసంచా దుకాణంలో పడటంతోనే మంటలు ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ దుకాణ యజమాని భూమా సురేష్ మృతి చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేటలో శుక్రవారం రాత్రి బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దుకాణ యజమాని భూమా సురేష్ మృతి చెందారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. రాత్రి 8.20 గంటలకు విజయవాడ హెడ్‌క్వార్టర్స్ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందిన వెంటనే చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాటర్‌జెట్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పల్నాడు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎస్. శ్రీధర్ తెలిపారు. దుకాణం ముందు ‘హవాయి’ తరహా బాణసంచా కాల్చడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆయన తెలిపారు. బయట కాల్చిన బాణసంచా ప్రమాదవశాత్తూ దుకాణంలోకి వెళ్లి అక్కడ నిల్వ ఉన్న బాణసంచాపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు వివరించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుకాణ యజమాని భూమా సురేష్‌ను చికిత్స నిమిత్తం తరలించగా మృతి చెందినట్లు తెలిసింది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దుకాణం నిర్వహణకు ఏడాది క్రితం ప్రొవిజనల్ పర్మిషన్ తీసుకున్నట్లు మీడియా అడిగిన ప్రశ్నకు ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ సమాధానమిచ్చారు. ప్రమాదానికి సంబంధించిన ఇతర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని ఫైర్ డైరెక్టర్ జనరల్ పి.వి. రమణ, అడిషనల్ డైరెక్టర్ జ్ఞానసుందరం, ఆర్‌ఎఫ్‌ఓ జిలానీ తదితర ఉన్నతాధికారులు పరిశీలించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News