Kaizer News

Samsung Galaxy Gallery : శామ్‌సంగ్ గెలాక్సీ యూజర్ల

Samsung Galaxy Gallery : శామ్‌సంగ్ గెలాక్సీ యూజర్లకు గుడ్ న్యూస్.. గూగుల్ ఫొటోస్ సింక్

· Technology · hmtvlive.com

Shorts శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు త్వరలో ఫొటోలు, వీడియోలను బ్యాకప్ చేసుకోవడం మరింత ఈజీ కానుంది. ఇప్పటివరకు గ్యాలరీ ఫొటోలను క్లౌడ్‌లో సేవ్ చేసుకోవడానికి వన్‌డ్రైవ్‌పై ఆధారపడుతున్న శామ్‌సంగ్.. ఇప్పుడు గూగుల్ ఫొటోస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా శామ్‌సంగ్ గ్యాలరీ యాప్‌లో గూగుల్ ఫొటోస్ సింక్కు సంబంధించిన కొత్త ఆప్షన్ కనిపించినట్లు సమాచారం. అయితే శామ్‌సంగ్ మాత్రం ఈ ఫీచర్‌ను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. శామ్‌సంగ్ గ్యాలరీ తాజా 15.9.01.7 వెర్షన్లో “సింక్ ఫొటోస్ అండ్ వీడియోస్” అనే కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. ఈ ఆప్షన్‌ను గ్యాలరీ యాప్‌లో మెనూ > సెట్టింగ్స్ > సింక్ ఫొటోస్ అండ్ వీడియోస్ ద్వారా యాక్సెస్ చేయవచ్చని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అన్ని గెలాక్సీ ఫోన్లలో అందుబాటులోకి వచ్చినట్లు కనిపించడం లేదు. కొత్త సింక్ ఆప్షన్ అందుబాటులో ఉన్న గెలాక్సీ యూజర్లు తమ గూగుల్ అకౌంట్ను శామ్‌సంగ్ గ్యాలరీతో కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో గ్యాలరీలో ఉన్న ఫొటోలు, వీడియోలను గూగుల్ క్లౌడ్‌కు సింక్ చేయవచ్చు. ఆ తర్వాత వాటిని గూగుల్ ఫొటోస్లో కూడా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే.. ఫొటోలను బ్యాకప్ చేయడానికి ప్రత్యేకంగా గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ చేసుకోవాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. శామ్‌సంగ్ గ్యాలరీతో మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ ఇంటిగ్రేషన్ కొంతకాలంగా గెలాక్సీ యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ భాగస్వామ్యం సెప్టెంబర్ 30తో ముగియనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శామ్‌సంగ్ గ్యాలరీలో గూగుల్ ఫొటోస్ ఇంటిగ్రేషన్ కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. వన్‌డ్రైవ్ సింక్ ముగిసిన తర్వాత గూగుల్ ఫొటోస్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునే అవకాశం గెలాక్సీ యూజర్లకు లభించవచ్చు. అయితే గూగుల్ ఫొటోస్ ఇంటిగ్రేషన్ అంటే గూగుల్ ఫొటోస్‌లో ఉన్న మొత్తం లైబ్రరీ శామ్‌సంగ్ గ్యాలరీలో కనిపిస్తుందని అనుకోవద్దు. గూగుల్ సపోర్ట్ సమాచారం ప్రకారం.. శామ్‌సంగ్ గ్యాలరీ క్లౌడ్ సింక్ ద్వారా ముందుగా బ్యాకప్ చేసిన మీడియాకు మాత్రమే గ్యాలరీ నుంచి యాక్సెస్ ఉండవచ్చు. గూగుల్ ఫొటోస్‌లో ఇప్పటికే ఉన్న, శామ్‌సంగ్ డివైస్ నుంచి సింక్ కాని ఇతర ఫొటోలు, వీడియోలు ఈ ఇంటిగ్రేషన్ ద్వారా అందుబాటులో ఉండకపోవచ్చు. శామ్‌సంగ్ మాత్రమే ఈ తరహా గూగుల్ ఫొటోస్ ఇంటిగ్రేషన్ తీసుకురావడం లేదు. షావోమీ, వన్‌ప్లస్, ఒప్పో వంటి ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు కూడా తమ గ్యాలరీ యాప్‌లలో గూగుల్ ఫొటోస్ ఇంటిగ్రేషన్‌ను ఇప్పటికే అందించారు. శామ్‌సంగ్ కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా సమాచారం సూచిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది గెలాక్సీ యూజర్లకు మాత్రమే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. శామ్‌సంగ్ అధికారికంగా ప్రకటించే వరకు ఇది అన్ని గెలాక్సీ డివైస్‌లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం స్పష్టంగా లేదు. అయితే వన్‌డ్రైవ్ ఇంటిగ్రేషన్ ముగింపు దశకు చేరుతున్న సమయంలో గ్యాలరీలో గూగుల్ ఫొటోస్ సింక్ కనిపించడం మాత్రం గెలాక్సీ యూజర్లకు ఆసక్తికరమైన పరిణామంగా మారింది. అక్ష

Original source: hmtvlive.com
Read more on Kaizer News