కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ నాగర్ కర్నూల్ ప్రతినిధి: పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ , రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డి పాల్గొని, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు మార్గదర్శనం చేశారు. జిల్లాలో ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రానున్న రబీ సీజన్‌లో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలి. సాగుకు ముందు నేల పరీక్షలు చేయించి, భూసారానికి తగినట్లు ఎరువులు వాడుతూ ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచడంతో పాటు, నాణ్యమైన ఉత్పత్తులు, విలువ ఆధారిత తయారీ ద్వారా అదనపు ఆదాయం సాధించాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీని అందిపుచ్చుకొని లాభదాయకమైన వ్యవసాయానికి బదిలీ కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ కృష్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జ్ఞానశేఖర్, జిల్లా భూగర్భ జల అధికారిణి దివ్యజ్యోతి, అడిషనల్ డీఆర్‌డీఓ రాజేశ్వరి, కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ శైల, ఆత్మ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు