Kaizer News

Rajampet: అభయ ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు చేసిన

Rajampet: అభయ ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజలు చేసిన సుగవాసి ప్రసాద్ బాబు!

· State - Telangana · hmtvlive.com

Rajampet: పవిత్ర శ్రావణమాసం 3వ శనివారం సందర్భంగా దిగువ అబ్బవరం గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకూరుపల్లె సురేష్ గారి ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఆహ్వానం మేరకు హాజరైన సుగవాసి ప్రసాద్ బాబు గారికి దిగువ అబ్బవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించి, శాలువా కప్పి ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు గారు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News