Kaizer News

Tanuku: ఆంధ్రాసుగర్స్ రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్

Tanuku: ఆంధ్రాసుగర్స్ రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

· State - Telangana · hmtvlive.com

Shorts తణుకు: తణుకు కుమ్మర్ల వీధిలోని అక్కమాంబ టెక్స్టైల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ది ఆంధ్రాసుగర్స్ లిమిటెడ్ రిటైర్డ్ పూర్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 60 మంది రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలు దాటిన రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఈపీఎఫ్ పెన్షన్ రూ.1,000గానే కొనసాగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య అవసరాలు, కుటుంబ పోషణకు ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి కనీస ఈపీఎఫ్ పెన్షన్‌ను రూ.7,500కు పెంచడంతో పాటు డీఏను కూడా అందించాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనర్ చోడే రామమోహన్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కురెళ్ళ వెంకటేశ్వరరావు, సభ్యులు అక్కిన నాగేశ్వరరావు, పీతల వెంకటేశ్వరరావు, బండా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News