Shorts Amalapuram: VRAల సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయాం అని ఎమ్మెల్యే ఆనందరావు వద్ద ఆవేదన వ్యక్తం చేసిన VRAలు. అమలాపురం నియోజకవర్గంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వి.ఆర్.ఏ)లు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చేపట్టిన సహాయ నిరాకరణ సమ్మె శనివారం నాటికి 4వ రోజుకు చేరుకుంది.ఈ సమ్మెలో భాగంగా VRAలు అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనందరావు ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా VRA నాయకులు ఎమ్మెల్యే కి తమ సమస్యలను వివరిస్తూ,గత వైస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేసిందని వాపోయారు.ప్రస్తుతం తమకు అందుతున్న రూ.10,500/-వేతనం పెరిగిన నిత్యావసరాల ధరలకు, కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని ఎమ్మెల్యే తో పేర్కొన్నారు. గ్రామస్థాయిలో భూ రికార్డుల రక్షణ,సంక్షేమ పథకాలు,శాంతిభద్రతలు మరియు విపత్తు నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న తమ శ్రమకు తగిన గుర్తింపు,ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. తమ సమస్యల పరిష్కారంలో భాగంగా VRA లకు తక్షణమే పే స్కేల్ వర్తింపజేయాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని,నామినీలుగా పనిచేస్తున్న VRAలను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేశారు. VRAల వినతిపై ఎమ్మెల్యే ఆనందరావు సానుకూలంగా స్పందించారు. గ్రామస్థాయిలో VRAలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొంటూ, గత ప్రభుత్వంలో VRAలు ఎదుర్కొన్న సమస్యలను,వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి,అలాగే సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఎమ్మెల్యే ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ VRA సంఘం ప్రతినిధులు,సభ్యులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు