Kaizer News

UP | యువ జంట బలవన్మరణం…

UP | యువ జంట బలవన్మరణం…

· National - India · prabhanews.com

UP | ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రభ : పెళ్లికి కుటుంబాలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో విషాదం నింపింది. సెంజని గ్రామానికి చెందిన 17 ఏళ్ల సుధ, 19 ఏళ్ల అనిల్ మృతదేహాలు పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. స్థానికుల సమాచారం ప్రకారం.. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వివాహం చేసుకోవాలని భావించినప్పటికీ, కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ గ్రామానికి కిలోమీటరు దూరంలోని పొలానికి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఉదయం పొలాలకు వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News