Kaizer News

నర్సాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల

నర్సాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల

· State - Telangana · prabhanews.com

నర్సాపురం, ఆంధ్రప్రభ : నర్సాపురం నియోజకవర్గం లో సెప్టెంబర్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కు సంబంధించి రూట్ మ్యాప్ ను అధికారులు విడుదల చేశారు. సి ఎం పర్యటన పై అధికారులు, ప్రజా ప్రతినిధులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేది ఉదయం 10.30 గంటలకు హెలీ క్యాప్టర్ ద్వారా మొగల్తూరు చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద 10.30 నిమిషాల నుండి 10.40 నిమిషాలు ప్రజా ప్రతినిధులు స్వాగతం పలుకుతారు. 10 .40 గంటలకు రోడ్డు మార్గంలో మొగల్తూరు నుండి నరసాపురం పట్టణంలోని 2, 3 వార్డుల్లోని గోదావరి ఏటిగట్టు వద్దకు 11.05 నిమిషాలకు చేరుకుంటారు. 11.05 గంటల నుండి 11.45 నిమిషాల వరకూ ఎన్టీఆర్ భరోసా పించన్ లబ్దిదారులతో సంబాషించి అక్కడ నుండి 11.45 గంటలకు పొన్నపల్లి వద్ద గోదావరిలో పడవ ప్రయాణం చేస్తారు. అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మొగల్తూరులో నిర్వహించే ప్రజా వేదిక స్థలానికి చేరుకుంటారు. మద్యాహ్నం 1.40 నిమిషాల వరకూ ప్రజా వేదిక వద్ద నిర్వహించే సమావేశంలో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శిసారు. మద్యాహ్నం 1.40 నుండి 2.50 నిమిషాల వరకూ విశ్రాంతి తీసుకుం టారు. సాయంత్రం 2.55 నిమిషాల నుండి 4.25 నిమిషాల వరకూ నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. కార్యకర్తల సమావేశం అనంతరం 4.25 నిమిషాల ను oడి 4.30 నిమిషాలకు హెలీప్యాడ్ కు చేరుకుని 4.30 అక్కడ నుండి 4.35 మొగల్తూరు హెలీప్యాడ్ నుండి బయలుదేరి సాయంత్రం 5.20కి ఉండవల్లికి ముఖ్యమంత్రి చేరకుంటారని ముఖ్యమంత్రి ప్రయివేట్ కార్యదర్శి ఆర్.కృష్ణ కపర్ది విడదల చేసిన ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్ను స్థానిక అధికారులు ప్రకటించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News