Kaizer News

Sircilla: సెప్టెంబర్ 1న సిరిసిల్లాలో రాష్ట్ర ఎస్సీ

Sircilla: సెప్టెంబర్ 1న సిరిసిల్లాలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటన

· State - Telangana · hmtvlive.com

Sircilla: ‌రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు సెప్టెంబర్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ జిల్లాకు రానున్నారు. మంగళవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్న కమిషన్ బృందం ఉదయం 11 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, వారికి అందుతున్న ప్రభుత్వ సేవలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News