Kaizer News

‘పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’

‘పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’

· Health · ntnews.com

గోడకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య మాల్, సెప్టెంబర్ 19 : గర్భిణీలు, బాలింతలు పౌష్టికారం తీసుకోవడం వల్ల తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని సర్పంచ్ కాశవాని వెంకటయ్య అన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల గ్రామ పంచాయతీలో గ‌ల అంగ‌న్‌వాడీలో నిర్వహించిన పోషణ మాసం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం ఆధ్వ‌ర్యంలో చిన్నారులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి, అంగన్‌వాడీ టీచర్లు లలిత, స్వప్న, యాదమ్మ, ప్రభావతి, ఏఎన్ఎం సరిత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News