Kaizer News

అనారోగ్యంతో ఉన్న సభ్యుడికి ‘వాకర్స్’ అండ..

అనారోగ్యంతో ఉన్న సభ్యుడికి ‘వాకర్స్’ అండ..

· State - Telangana · prabhanews.com

పటమట, ఆంధ్రప్రభ: అనారోగ్యానికి గురైన సిద్ధార్థ వాకర్స్ క్లబ్ సభ్యుడు, ఫొటోగ్రాఫర్ పోలూరు హనుమంతరావుకు క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. వైద్య ఖర్చుల కోసం సభ్యులు కలిసి సమీకరించిన రూ.2,07,157లను ఆదివారం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చేతుల మీదుగా హనుమంతరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ హనుమంతరావు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హనుమంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిద్ధార్థ వాకర్స్ క్లబ్ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News