Shorts Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకరరెడ్డి ఆదేశాల గారు మేరకు పాలకొండ మండలం రెవిన్యూ కార్యాలయంలో తహశీల్దార్ సిహెచ్ రాధాకృష్ణ మూర్తి ఆధ్వర్యంలో వారంతపు సమావేశం పాలకొండ వీఆర్వోలతో మరియు రెవెన్యూ సిబ్బంది తో నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్ధార్ సిహెచ్ రాధాకృష్ణ మూర్తి పాలకొండ మండల పరిధిలో ఉన్న అన్ని సచివాలయం విఆర్వోలతో (రెవిన్యూ క్లీనిక్ ) గ్రీవెన్స్ లో ప్రతి గురువారం ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు తక్షణమే గ్రామస్థాయిలో పరిష్కరించాలని అలాగే మీ పరిధిలో లేనివి నా వరకు వచ్చి పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని వీఆర్వోలకు ఎమ్మార్వో రాధాకృష్ణ సూచనలు ఇచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో అనాధికారికంగా పొజిషన్ సర్టిఫికెట్లు వస్తున్నాయని అటువంటి వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదని రెవెన్యూ కి సంబంధించి ఏమైనా పొజిషన్లో సర్టిఫికెట్లు ఇస్తే ఎంత స్థాయి నుండి పై స్థాయి వరకు వెరిఫికేషన్ చేసి అధికారులు సంతకాలు చేస్తేనే పొజిషన్ సర్టిఫికెట్స్ రెవెన్యూ పరంగా అన్ని విధాలుగా సర్టిఫికెట్లు లబ్ధిదారునికి హక్కు కలుగుతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, ఏమైనా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసినట్లయితే చట్టపరంగా క్రిమినల్ కేసులు పెడతామని తహశీల్దార్ రాధాకృష్ణ హెచ్చరించారు. అలాగే రెవెన్యూ క్లినిక్ లో భూ సమస్యలపై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించే దిశగా వెళ్ళినప్పుడు ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని దానికి ప్రధాన కారణం ఎవరు ఫిర్యాదు చేస్తున్నారో వారి మొబైల్ నెంబరు సరి అయినది ఇవ్వకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అలాగే పాలకొండ మండల రెవెన్యూ పరిధిలో పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఉంటే ప్రజా సమస్యల వేదిక జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ప్రజలు వెళ్ళవచ్చని, దీన్ని రెవెన్యూ అధికారులు గమనించాలని, రెవెన్యూ పరంగా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురవకుండా చూసుకునే బాధ్యత మనపై ఉందని ఈ సమావేశంలో వీఆర్వోలకు. ముఖ్య సూచనలు తెలిపారు. ఈ సమావేశం లో రెవెన్యూ విఆర్వోలు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు