Kaizer News

15.6 కిలోల బంగారం పట్టివేత

15.6 కిలోల బంగారం పట్టివేత

· State - Telangana · ntnews.com

మహిళ నుంచి స్వాధీనం నాదియా: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. ఒక మహిళ అక్రమంగా రవాణా చేస్తున్న రూ.24.95 కోట్ల విలువైన 15.607 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌ నాదియా జిల్లాలో బన్‌పూర్‌ సరిహద్దు వద్ద ఈ బంగారాన్ని సీజ్‌ చేసినట్టు వెల్లడించింది. ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించిన జవాన్లు ఆమెను నిర్బంధించి సోదా చేయగా ఈ అక్రమ రవాణా విషయం వెలుగు చూసింది. తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం ఆ మహిళను కృష్ణగంజ్‌ పోలీసులకు అప్పగించనున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News