Shorts పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బికియా నాయక్ తండాకు చెందిన 25 ఏళ్ల ప్రేమ్ కుమార్ కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం జనగామ బస్టాండ్ వద్ద కనిపించిన అతడు, తాజాగా దేవరుప్పుల మండలం కోలుకొండ గుట్టల్లో శవమై కనిపించాడు. మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి పడేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియాల్సి ఉంది