Kaizer News

ఘనంగా పెద్దమ్మ తల్లికి బోనాలు

ఘనంగా పెద్దమ్మ తల్లికి బోనాలు

· State - Telangana · ntnews.com

భువనగిరి అర్బన్, ఆగస్టు 29 : భువనగిరి పట్టణంలోని బార్ పేట్, ఎల్బీనగర్ లో భువనగిరి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సిద్ధంకి కోటయ్య ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లికి అంగరంగ వైభవంగా డబ్బు చప్పులతో బోనాల ఊరేగింపు శనివారం నిర్వహించారు. బోనాల ఉత్సవంలో భువనగిరి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎనబోయిన జహంగీర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు భువనగిరి పట్టణ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు కోలుపుల కమలాకర్, కూర వెంకటేష్, మాటూరు అశోక్, కొలుపుల నాగరాజు, కూర శ్రీనివాస్, ఎనబోయిన చంద్రశేఖర్, కొలుపుల కిష్టయ్య, పలపటి శ్రీనివాస్, తుపాకుల అనిల్, సైదులు, శ్రీకాంత్, సూరి, ముదిరాజ్ బంధువులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News