Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ విజయానంతరం వెంకటేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించే త్రివిక్రమ్, వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో ఈసారి ఎలాంటి వినోదాన్ని అందించబోతున్నారనే ఆసక్తి నెలకొంది