శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో వర్షం కురవాలని పిల్లలు, గ్రామస్థులు కప్పలకు పూజలు చేశారు.వర్షం కురవాలని పిల్లలు దేవుడిని ప్రార్థిస్తూ,వీదులలో కప్పను తీసుకెళ్తుండగా మహిళలు పూజలు చేసి బియ్యము, బ్యాళ్ళు సమర్పించారు. కప్ప దేవర నిర్వహిస్తే వర్షాలు కురుస్తాయని,పాడి,పంటలు బాగా వృద్ధిచెందుతాయని ప్రజల నమ్మకం