Kaizer News

ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల డంపులు..సుక్మా

ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల డంపులు..సుక్మా, నారాయణ్పూర్ అడవుల్లో వెలికితీసిన భద్రతాబలగాలు

· State - Telangana · v6velugu.com

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్ దండకారణ్యంలోని నారాయణపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంప్ లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి ఇంటిలిజెన్స్ వర్గాలు సేకరించిన సమాచారం మేరకు బలగాలను అడవుల్లో తిరుగుతూ డంప్ లను వెలికితీస్తున్నాయి. నారాయణ్​పూర్ ఎస్పీ సందీప్​కుమార్​పటేల్​ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పోలీసులు, బీఎస్​ఎఫ్​జవాన్లు అదనార్​అడవుల్లో తనిఖీలు చేపట్టాగా డంప్ బయటపడింది. 303 రైఫిల్, నాలుగు 315 రైఫిల్స్, ఐదు 12 బోర్​తుపాకులు, రెండు బీజీఎల్ లాంఛర్లు, టెలీస్కోప్, 13 బీజీఎల్​సెల్స్, పదహారు 12 బోర్​తూటాలు, 2 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని నారాయణ్​పూర్​ఎస్పీ ఆఫీస్ కు తరలించారు. అలాగే సుక్మా ఎస్పీ మయాంగ్​గుర్జర్​ నేతృత్వంలో డీఆర్​జీ, జిల్లా పోలీసులు, బస్తర్​ఫైటర్స్ కలిసి కుంట పోలీస్​స్టేషన్ పరిధిలోని బెల్​పొచ్చా -గొంపాడు గ్రామ అడవుల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ నాలుగు బండిళ్ల కొడెక్స్ వైర్, పది డిటోనేటర్లు, 17 జిలిటిన్​ స్టిక్స్, ఫ్యూజ్​ వైరు, మూడు బండిళ్ల కరెంటు తీగ, 3, 5 కిలోల బరువున్న టిఫిన్స్ బాక్సు బాంబులు, ప్లాస్టిక్​డస్ట్ బిన్స్, స్టీల్​ టిఫిన్​బాక్సులు, బ్యాటరీ దొరకగా.. వాటిని సుక్మా ఎస్పీ ఆఫీసుకు తరలించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News