Shorts సఖినేటిపల్లి: సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలోని 2వ నంబర్ సచివాలయ పరిధిలో రూ.30 లక్షల నిధులతో నిర్మించిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఆదివారం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక దశలోనే వైద్యుల సలహాలు, చికిత్స పొందాలని సూచించారు. కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ద్వారా గ్రామ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అందించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సఖినేటిపల్లి పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ పి. జయ గాయత్రీ, డాక్టర్ సీహెచ్. దుర్గా కావ్య, పీహెచ్ సి మరియు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు