Kaizer News

Jangaon: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవ

Jangaon: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

· State - Telangana · hmtvlive.com

జనగామ: శనివారం, హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నోటీసుల జారీ, పరిష్కార చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలని, ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులో విచారణ చేపట్టాలని, సంబంధిత రికార్డుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అన్ని నోటీసులను సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా అందజేయాలని, నోటీసులు అందజేసిన రోజు నుంచి 7 రోజుల గడువు పూర్తయిన అనంతరం విచారణ నిర్వహించాలని సూచించారు. అనామలీస్/నో మ్యాపింగ్ జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని, సంబంధిత వ్యక్తులు క్లెయిమ్స్, అభ్యంతరాల సందర్భంగా సమర్పించాల్సిన పత్రాలు, ఆధారాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రస్తుత స్థితిని రోజువారీ ప్రాతిపదికన నోటీస్ బోర్డుపై నవీకరించాలని, ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ, నిర్దేశిత గడువులో పనులను పూర్తి చేయాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను సజావుగా నిర్వహించాలని తెలిపారు. ఈ ప్రక్రియ కొరకు నియమించిన ఏఈఆర్ఓలకు అవసరమైన శిక్షణ అందించాలని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివరిస్తూ.. జిల్లాలో అనామోలీస్, మ్యాపింగ్ కానీ ఓటర్లకు సంబంధించి నోటీసులు జారీ చేసి యాప్ లో వివరాలు నవీకరించడం జరిగిందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియ నిర్వహించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సీఈఓకు, కలెక్టర్ వివరించారు. ఈ వీసీ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు నోటీసులను సంబంధిత వ్యక్తులకు మాత్రమే అందజేసేలా ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నోటీసులు అందజేసిన అనంతరం సంబంధిత వ్యక్తి నుంచి అక్నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవడంతో పాటు, ప్రక్రియకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు. నోటీసులు అందజేసిన తర్వాత హియరింగ్‌ ప్రక్రియను కూడా ముందస్తు ప్రణాళికతో నిర్వహించాలని తెలిపారు. హియరింగ్‌కు రెండు రోజుల ముందే సంబంధిత ఓటర్లకు మరోసారి సమాచారం అందించి, హియరింగ్‌ తేదీ, సమయం గురించి గుర్తు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జనగామ, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీధర్,

Original source: hmtvlive.com
Read more on Kaizer News