Kaizer News

Munugode: బుగ్గ ఫారెస్ట్‌లో కలప స్మగ్లర్ల బీభత్సం:

Munugode: బుగ్గ ఫారెస్ట్‌లో కలప స్మగ్లర్ల బీభత్సం: మద్ది చెట్లకు గొడ్డలిపెట్టు!

· State - Telangana · hmtvlive.com

Shorts మునుగోడు: మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో బుగ్గ ఫారెస్ట్‌లో విలువైన అటవీ సంపదకు రక్షణ కరువైందా. దశాబ్దాల నాటి మద్ది వృక్షాలను రాత్రివేళల్లో యథేచ్ఛగా నరికివేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మర్రిగూడ మండలంలోని అజిలాపురం, ఖుదాబాక్సుపల్లి, వెంకేపల్లి గ్రామపంచాయతీల పరిధిలో ఈ అక్రమ నరికివేత సాగుతున్నట్లు స్థానికులు ఆరోపణ. 20 రోజులుగా కొనసాగుతున్న అక్రమ కలప దందా. గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో చెట్ల నరికివేత. ట్రాక్టర్లు, లారీల్లో హైదరాబాద్‌కు కలప తరలింపు. గ్రామస్తులు అడ్డుకుంటే తప్ప. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు. రెండు లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. మరో లారీ పరార్. అటవీశాఖ అధికారుల నిఘా ఎక్కడ.? చర్యలు ఎప్పుడు. డ్రోన్, శాటిలైట్ సర్వేతో అక్రమ నరికివేతను తేల్చాలని డిమాండ్. అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు.? అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నరికివేతకు గురైన ప్రాంతాల్లో వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించి, ఎన్ని చెట్లు నరికారో లెక్క తేల్చాలని కోరుతున్నారు. అక్రమ కలప రవాణా వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, వాహనాలను స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. బుగ్గ ఫారెస్ట్‌లో చెట్ల నరికివేతపై ఉన్నతాధికారులు వెంటనే స్పందిస్తారా.? అక్రమ కలప దందాకు అడ్డుకట్ట పడుతుందా? అనేది వేచి చూడాలి

Original source: hmtvlive.com
Read more on Kaizer News