Kaizer News

Asifabad: చింతలమానెపల్లిలో పశువుల అక్రమ రవాణా ముఠా

Asifabad: చింతలమానెపల్లిలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్!

· State - Telangana · hmtvlive.com

Shorts ఆసిఫాబాద్: తేదీ 21 జూలై 2026 న కర్జవెల్లి గ్రామ సమీపంలో మహీంద్రా జైలో వాహనంలో పశువులను అక్రమ రవాణా చేసిన కేసులో మహారాష్ట్రకు చెందిన A4 నిందితుడు కృష్ణ@రాజు అనే వ్యక్తిని, తేదీ 11 ఆగస్టు 2026 నాడు ఆడపెల్లి గ్రామం నందు పాల వ్యాన్లో పశువులని అక్రమ రవాణా చేసిన కేసులో కాగజ్ నగర్ కు చెందిన A1 ఇనాయత్ ఖాన్ అనే వ్యక్తిని, కోర్సుని గ్రామంలో అక్రమంగా పశువులను ఎటువంటి పత్రాలు లేకుండా తరలించిన కేసులో బెజ్జూరు మండలం సలుగుపల్లికి చెందిన A1 ఇప్ప అంజయ్య, మహారాష్ట్రకు చెందిన A2 కొడుపే జితేంద్ర యశ్వంత్ అనే వ్యక్తులకు మరియు దిందా గ్రామంలో ఎటువంటి పత్రాలు లేకుండా ఐదు ఎడ్లను అక్రమ రవాణా చేసిన కేసులో మహారాష్ట్ర కు చెందిన గోలేటివార్ అశోక్ లకు గౌరవ కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. కావున సరైన పత్రాలు లేకుండా మరియు పశువులను అక్రమ రవాణా చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చింతలమానెపల్లి ఎస్ఐ కమలాకర్ తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News