Kaizer News

Nellore: నెల్లూరులో "మా రాముడు అందరివాడు"

Nellore: నెల్లూరులో "మా రాముడు అందరివాడు" సినిమా ట్రైలర్ ఆవిష్కరణ!

· Entertainment · hmtvlive.com

Nellore: నెల్లూరు, అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన నూతన చిత్రం "మా రాముడు అందరివాడు" సినిమా ప్రమోషన్ కార్యక్రమం, ట్రైలర్ విడుదల వేడుక శనివారం నెల్లూరు వి.ఆర్.సి. మైదానంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ బ్యానర్ ద్వారా సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో పాలకొండ శ్రీరాములు, హీరోయిన్ స్వాతి మందడి, దర్శకుడు యద్దనపూడి మైఖిల్, నిర్మాతలు అనుమల లక్ష్మణరావు, పాలకొండ శ్రీరాములు పాల్గొన్నారు. చిత్ర విశేషాలను వారు ప్రేక్షకులతో పంచుకుంటూ, సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన సినీ అభిమానులు, పలువురు ప్రముఖులు ట్రైలర్‌ను వీక్షించి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న "మా రాముడు అందరివాడు" చిత్రం ఘన విజయాన్ని సాధించాలని కార్యక్రమానికి హాజరైన వారు ఆకాంక్షించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News