Godavari River Tourism: గోదావరి తీరంలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రాజమహేంద్రవరంలో తొలిసారిగా హౌస్‌బోట్, ఫ్లోట్ ఇన్ డైన్ సేవలను ప్రారంభించారు. దీంతో గోదావరి పర్యాటకానికి మరింత ఆకర్షణ పెరగనుంది. హౌస్‌బోట్‌లో గోదావరి నదిపై విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలను నది మధ్య నుంచి వీక్షించడంతో పాటు.. రాత్రి వేళల్లో గోదావరి మధ్యలోనే బస చేసే ప్రత్యేక అనుభూతిని కూడా పర్యాటకులు […]