Kaizer News

భరత్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి

భరత్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి

· State - Telangana · ntnews.com

కళాశాల ఎదుట ధర్నాలో బీఆర్‌ఎస్‌వీ నేతలు అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తెలకపల్లి పీఎస్‌కు తరలింపు నాగర్‌కర్నూల్‌, సెప్టెంబర్‌ 19 : నాగర్‌ర్నూల్‌లోని ఫూలే బాలుర గురుకులంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి భరత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు డిమాండ్‌ చేశారు. అధ్యాపకుల వేధింపులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కళాశాల ఎదుట బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులను హాస్టల్‌లో నిర్బంధించి, టీసీలు ఇచ్చి పంపిస్తామని, ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌ చేయిస్తామని ఆర్‌సీవోతోపాటు, ప్రిన్సిపాల్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆం దోళనకు దిగిన బీఆర్‌ఎస్‌వీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి తెలకపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు

Original source: ntnews.com
Read more on Kaizer News