Kaizer News

తెలంగాణ పలుకు.. తేనెలొలుకు!

తెలంగాణ పలుకు.. తేనెలొలుకు!

· State - Telangana · ntnews.com

9న తెలంగాణ భాష దినోత్సవం తెలంగాణ భాష, యాస, అందులోని పలుకుబడులు మన ప్రాంత సంస్కృతికి, చారిత్రక వైభవానికి, ప్రజల జీవన విధానానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. శతాబ్దాల కాలంగా వివిధ రాచరికాల పాలన, ముఖ్యంగా నిజాం నవాబుల పాలన ప్రభావం వల్ల తెలంగాణ తెలుగు భాషలో ఉర్దూ, పర్షియన్‌, మరాఠీ, కన్నడ పదాలు సహజంగా కలిసిపోయి, ఒక విలక్షణమైన రూపాన్ని సంతరించుకున్నాయి. మన తెలంగాణ భాష కేవలం ఒక సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు; అది శ్రమజీవుల స్వేదం, ఉనికి, మట్టి వాసన, ఆత్మీయతల కలయిక. తెలంగాణ పలుకుబడుల్లో నిష్కల్మషత్వం తొణికిసలాడుతుంది. ఇక్కడి సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు నిత్య జీవితంలోని కష్టసుఖాలను హాస్యాన్ని, వ్యంగాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ తర్వాత నుంచి కాళోజీ జయంతి రోజైన సెప్టెంబర్‌ 9న యేటా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాష ఒక కీలక పాత్ర పోషించింది. ఉద్యమ సందర్భంగా అచ్చమైన తెలంగాణ పలుకుబడిలో కేసీఆర్‌ చేసిన ప్రసంగాలు తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచాయి. సీమాంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ పలుకుబడిలో ఎవరైనా మాట్లాడడానికి వెనుకా ముందు ఆడేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ భాషను ఆయుధంగా చేసుకుని కేసీఆర్‌ ఉద్యమాన్ని నడిపారు. అచ్చమైన తెలంగాణ భాషలో సాగే కేసీఆర్‌ ప్రసంగాలు తెలంగాణ ప్రజలను కట్టిపడేశాయి. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధానంగా ఈ మూడు అంశాలపై ఇక్కడి ప్రజలు ఉద్యమించారు. ఈ మూడే కాదు, తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతిక కోణం కూడా ఉన్నది. అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకున్న తెలంగాణ భాషకు, సాంప్రదాయాలకు సరైన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదన దానిలో కలగలిసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో తెలంగాణ భాష నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైంది. తెలంగాణ భాషలో ఎంతో అర్థవంతమైన పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు మేర అనే పదం. ఇతర ప్రాంతాల వారు దర్జీ అంటారు. ఇది ఉర్దూ నుంచి వచ్చింది. వాస్తవానికి తెలంగాణలో వాడే మేర పదాన్ని పరిశీలిస్తే పొలిమేర, ఆ మేరకు, ఈ మేరకు అనే మౌఖిక ప్రయోగాలు ఉన్నాయి. మేర అంటే హద్దులని అర్థం. మేరవారు గుడ్డల్ని కత్తిరించి కుట్టేది వ్యక్తి మేరను బట్టే కదా. ఇది అసలు సిసలు తెలుగు పదం. సోయి, సోయిలేదు, సోయిసుద్ది, సోయిసెప్పటం లాంటివన్నీ తెలుగు పదాలు. తెలంగాణ భాషలో అచ్చమైన తెలుగు పోకడలు చాలా ఉన్నాయి. తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు అలయ్‌ బలయ్‌ కలగలిసిపోవటం కూడా గొప్ప విశేషం. తెలంగాణ తెలుగులో పెద్దపెద్ద సమాసాలు, సంస్కృత పదభూయిష్టమైన తీరుతెన్నులు బహుతక్కువ. నలిమెల భాస్కర్‌ ‘తెలంగాణ పదకోశం’లో అనేక పదాల కూర్పు జరిగింది. తెలంగాణ పద సౌందర్యాన్ని ఆయన పట్టివ్వగలిగారు. ‘ఏ భాషకైనా జవజీవాలు జాతీయాలు, సామెతలే. తెలంగాణ వాసుల పలుకు పలుకులో నుడికారం ఉంటుంది. చల్లగా ఉండేది చల్ల (మజ్జిగ), ఎర్రగా ఉండేది ఎర్ర (వానపాము), లాగుతూనే వేసుకునేది లాగు, అంగాన్ని కప్పి ఉంచేది అంగి, కంకుతూ తింటం గనుక కంకి’. ఇలాంటి మాటలెన్నో నలిమెల భాస్కర్‌ మనమందు ఉంచారు. అదేవిధంగా ‘గుమ్మి’ అనేది ప్రముఖ తెలంగాణ కథా రచయిత, నవలాకారుడైన డా.కాలువ మల్లయ్య రచించిన ఒక విశిష్టమైన

Original source: ntnews.com
Read more on Kaizer News