Kaizer News

Warangal: అద్భుతంగా 'జస్టిస్ వినాయకుడు' కోర్టు నమూ

Warangal: అద్భుతంగా 'జస్టిస్ వినాయకుడు' కోర్టు నమూనాలో ప్రత్యేక ప్రతిమ

· State - Telangana · hmtvlive.com

Shorts Warangal: బట్టల బజార్ లోని సిద్ధి వినాయక ఆధ్వర్యంలో కోర్ట్ నమూనా తో, గణపతిని జడ్జిగా రూపొందించిన ప్రతిమను ప్రతిష్టించారు. నెలరోజుల పాటు స్థానిక కళాకారులతో కోర్టు నమోనాతో, గణపతి న్యాయమూర్తిగా, పోలీస్, న్యాయవాదులు, మూషికాన్ని బంట్రోత్తుగా ఏర్పాటు చేసి బారి సెట్టింగ్లతో ఏర్పాటు చేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని ఈసారి కోర్ట్ నమూనాతో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. వరంగల్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక ఉత్సవ కమిటీలు గణపతిని వివిధ రూపాల్లో ఏర్పాటు చేయగా రామన్నపేటలో న్యాయమూర్తిగా గణపతిని ప్రతిష్టించి పూజలు చేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నది. జస్టిస్ గణపతిని చూడడానికి వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మల గీతాంబా, హనుమకొండ జిల్లా న్యాయమూర్తి సునీత, వేములవాడ సివిల్ కోర్ట్ సీనియర్ న్యాయమూర్తి అజయ్ జాదవ్,మరియు డీఎల్ఎఫ్ సెక్రటరీ పూజ, న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తులకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సుమన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మల గీతాంబా మాట్లాడుతూ జడ్జిని దేవుడిగా చూపించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆదిదేవుడు వినాయకుడు విఘ్నాలను తొలగించి ప్రజలను రక్షించాలని ఆమె కోరారు. నాలుగు పాదాల మీద నడిచే ధర్మం కలియుగంలో ఒకే పాదం మీద నడుస్తున్నదని, అలా కాకుండా నాలుగు పాదాలు మీద ధర్మాన్ని నడిపించాలనే ఆకాంక్షతో జస్టిస్ వినాయకుని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని న్యాయమూర్తులు కోరుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News